తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భూప్రకంపనలు…

చంద్రపూర్ : తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో శనివారం భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల జిల్లాలో కాలేజ్‌ రోడ్‌, సున్నంబట్టివాడ, శ్రీశ్రీనగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతారాంపూర్‌, షిర్కేలో రెండు సెకండ్లపాటు భూమి కంపించింది.

పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ, జ్యోతినగర్, మల్కాపూర్, నర్రాశాలపల్లె ప్రాంతాలలో 2 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.