రెమెడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ లో విక్రయిస్తున్న క్రైస్ట్ హాస్పిటల్ వైద్యులు, నర్సులు మరియు మరో ఐదుగురు అరెస్టు

Facebook
Twitter
Telegram
WhatsApp

చంద్రపూర్ : రెమెడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ఐదుగురిని చంద్రపూర్ లో అరెస్టు చేశారు. నిందితుడు 25 వేల రూపాయలకు ఇంజెక్షన్లు అమ్ముతున్నాడ నే సమాచారంతో
శుక్రవారం మధ్యాహ్నం చంద్రపూర్ నగరంలో జరిగిన రెమ్‌దేసివిర్ అక్రమ విక్రయ దోపిడీ కేసుపై పోలీసుల దర్యాప్తు షాకింగ్ సమాచారాన్ని వెల్లడించింది. నగరంలోని క్రైస్ట్ హాస్పిటల్‌లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇన్‌ఛార్జి డాక్టర్ జావేద్ సిద్దిఖీని బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న కేసులో నిన్న రాత్రి అరెస్టు చేశారు. ఈ అక్రమ కేసులోలో క్రైస్ట్ హాస్పిటల్‌లో వైద్యుడికి సహాయం చేసిన ఇద్దరు నర్సులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

క్రైస్ట్ హాస్పిటల్ నగరం యొక్క ప్రధాన ప్రభుత్వ కోవిడ్ కేంద్రం. పడకల సామర్థ్యం తో పాటు ఇక్కడి చికిత్స పై రోగులకు అపార నమ్మకం ఉంది. , కోవిడ్ చికిత్సలో విశ్వసనీయతకు మారు పేరు ఈ కేంద్రం శుక్రవారం రాత్రి, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఎ) గాంధీ చౌక్ లోని రద్దీ ప్రాంతంపై దాడి చేసి, విక్రేత మరియు కొనుగోలుదారుని అరెస్టు చేసింది. కేసు నమోదు చేసి నగర పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు.

పోలీసులు దర్యాప్తు లో బాగంగా సంఘటన స్థలానికి చేరుకుని క్రైస్ట్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ కేసులో మొత్తం ఐదుగురిని ఇప్పుడు అరెస్టు చేశారు. చంద్రపూర్ పట్టణం తోపాటు జిల్లాలో అంతటా ఈ వార్తతో ఉలిక్కిపడింది. ఈ ఆసుపత్రికి పంపిన ఇంజెక్షన్లు ఎంత అధిక ధరలకు అమ్ముడవుతున్నాయనేది ముఠా విక్రయించిన ఇంజెక్షన్ల సంఖ్య గురించి పోలీసుల దర్యాప్తులో నిజం తెలుస్తుంది. ఈ ఇంజెక్షన్లు రోగి పేరిట ఉచితంగా పంపిణీ చేయబడుతున్నాయి. కాబట్టి డబ్బు కోసం దురాశ కారణంగా వైధ్యులు ఇంజెక్షన్లు అక్రమంగా తరలించి ఎంత మంది రోగులు మరణించడాని కారకులయ్యరనేది, రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెట్ యొక్క ఈ గొలుసు ఎక్కడికి వరకు ఉందో విచారణలో వెల్లడికానుంది.