Telangana 10th Results 2021: ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల ; ఇలా చెక్ చేసుకోండి

Facebook
Twitter
Telegram
WhatsApp

తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు కాసేపటి క్రిత‌మే విడుద‌ల‌య్యాయి. ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. క‌రోనా కార‌ణంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేని నేప‌థ్యంలో ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణ‌యించారు. పదవ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5 ,21 ,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్ర‌క‌టించారు.

వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారు ఉన్నారు. రెగ్యులర్ గా హాజరై ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,62,917 మంది విద్యార్థులు బాలురు.. 2,53,661 మంది బాలికలు ఉన్నారు. ఇక 2 ,10,647 మంది విద్యార్థులు 10/10 జి.పి.ఎ సాధించారు. ఇక మొత్తం 535 పాఠశాలలు 10/10 జి.పి.ఎ. సాధించాయి.

ఫ‌లితాలు ఇలా చెక్ చేసుకోవాలి
విద్యార్థులు

www.bse.telangana.gov.in , results.bsetelangana.org వెబ్ సైట్ లలో సాయంత్రం మూడు గంటల నుంచి పొందవచ్చు. ఇందులో భాగంగా విద్యార్థులు హాల్‌టికెట్‌ స్థానంలో తమ పేరు, పుట్టిన తేదీ, పాఠశాల పేరు నమోదు చేసి మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఫలితాలు ప్రకటించిన వెంటనే విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి మార్కుల మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్.ఎస్ .సి. బోర్డుకు తెలియజేయాలని సూచించారు.