Karimnagar : నిండు గర్భిణి ; కనికరం చూపించని వైద్యులు, చివరికి దారుణం

Facebook
Twitter
Telegram
WhatsApp

కరోనా కాలంలో గర్భిణి మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. వైద్యుల కర్కశత్వం. కొవిడ్ నిబంధనలతో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలా మరోసారి ఓ తల్లి తన ఇద్దరు పిల్లల ప్రాణాలను కడుపులోనే కోల్పోయింది.

కరోనా కాలంలో గర్భిణిలు అనేక అవస్థలు పడుతున్నారు. కరోనా అనే అనుమానంతో గర్భిణి మహిళలను ఆసుపత్రుల చుట్టు తిప్పుతూ. వారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటీ సంఘటనలు ఇటివల ఎక్కువగా నమోదు అవుతున్నాయి. గత వారం రోజుల క్రితమే ఓ నిండు గర్భిణిని కరోనా పేరుతో ఆసుపత్రుల చుట్టు తిప్పడంతో ఆమె ప్రాణం కొల్పోయింది. దీంతో సంఘటనపై కలెక్టర్ విచారణ చేపట్టింది. మరికొంతమందికి కరోనా ఉందని తేలడంతో హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే 108 సిబ్బంది పురుడు పోస్తున్న దాఖలాలు అనేకం బయటకు వస్తున్నాయి.

ప్రభుత్వాలు పేరుకు అనేకం చెబుతున్నారు..కరోనా గర్భిణిలకు పురుడు పోస్తున్నట్టు అనేక వార్తలు వస్తున్నాయి.. ఇది పలు ఆసుపత్రుల విజయంగా చెప్పుకుంటూ మురిసి పోతున్నారు..అదే సమయంలో కరోనా ఉందంటూ కనీసం గర్భిణి అని కూడ చూడకుండా మరికొన్ని ఆసుపత్రులు రాక్షసంగా వ్యవహరిస్తున్నాయి..ఇలా ఆసుపత్రుల వ్యవహారంతో చాల మంది తల్లులు తమ ప్రాణాలను లేదా తమకు పుట్టే పిల్లల ప్రాణాలను కోల్పోతున్నా దీన పరిస్థితులు సమాజంలో నెలకొన్నాయి.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నా. కొన్ని సంఘటనలు మాత్రమే వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో గర్భిణి నిండు చూలాలతో అష్టకష్టాలు పడింది. నీది ఈ జిల్లా కాదు అంటూ వైద్యుల చూపించిన నిర్లక్ష్యంతో కడుపులోనే ఒకరు పుట్టిన తర్వాత మరోకరి ప్రాణాలు కోల్పోయాయి. దీన్ని బట్టి రాష్ట్రంలో కరోనా సోకిన గర్భిణిలకు ఏమేరకు వైద్యం అందుతుందో అర్థం చేసుకోవచ్చు.

వివరాల్లోకి వెళితే : నిండు గర్భిణి, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు బేగంపేటకు చెందిన బెజ్జంకి కమల రెండవ కాన్పుకు కోసం ఈ నెల 18న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్యకేంద్రానికి ప్రసవానికి వెళ్లింది. అయితే అక్కడి వైద్యులు ఆమెకు ప్రసవం చేసేందుకు నిరాకరించారు. ఆమె స్వంత జిల్లా అయిన సిద్దిపేటకు వెళ్లాలని సూచించారు. దీంతో ఆమె తిరిగి సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి వెళ్లింది. అయితే అక్కడి వైద్యులు మరో మాట చెప్పారు. సిద్దిపేటలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయంటూ జిల్లాలోని గజ్వేల్‌‌కు ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు. దీంతో చేసేదేమిలేక గర్భిణి బంధువులు ఆమెను గజ్వేల్ ఆసుపత్రికి సైతం తీసుకువెళ్లారు.

ఇక అక్కడ కూడ ఆమెకు చుక్కెదురైంది. గజ్వేల్ వైద్యులు సైతం వైద్యం చేయకుండా తిరిగి ఉచిత సలహా ఇచ్చారు..వెంటనే హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు. దీంతో హైదరాబాద్‌కు వెళ్లలేని కుటుంబసభ్యులు తిరిగి కరీంనగర్ ఆసుపత్రికి వెళ్లారు. ఇవన్ని ఆసుపత్రులు తిరిగే సరికే గర్భిణికి రెండు రోజులు పట్టింది. చివరకు కరీంనగర్ వైద్యులు కాళ్లావేళ్లా పట్టుకోవడంతో కమలకు ఆసుపత్రిలో అడ్మిషన్ ఇచ్చి శస్త్రచికిత్స చేశారు. అయితే అప్పటికే దారుణం జరిగిపోయింది. కమల ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. కాని ఇద్దరి పిల్లల్లో ఆడశిశువు గర్భంలోనే చనిపోయింది. ఇంకో మగశిశువు ప్రాణంతోనే ఉన్నా. చాల వీక్‌గా ఉండడంతో ఐసీయూలో పెట్టి చికిత్స అందించారు..రెండు రోజుల చికిత్స అనంతరం ఆ మగశిశువు కూడ మృతి చెందింది. దీంతో ఆగ్రహం చెందిన కమల బంధువులు ఆసుపత్రి వద్ద ధర్నా చేశారు.  వైద్యుల నిర్లక్ష్యం వల్లే బిడ్డల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకేముంది వైద్యులు రోటిన్ డైలాగులు చెప్పారు..నిబంధనల ప్రకారమే తాము నడుచుకున్నామని వెల్లడించారు.

ఇలా నిబంధనల పేరు చెప్పి నిండు గర్భిణిలపై కూడ కర్కశం వహిస్తున్న ప్రభుత్వ వైద్యుల తీరు సమాజానికి మాయని మచ్చగా ఉంటుంది..తమ వృత్తి ధర్మాన్ని వీడి నిబంధనలంటూ. వైద్యులు ఓ తల్లికి గర్భకోశం మిగిల్చారు. దీంతో ఇలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.