హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య స్థలంలో పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు

0
309
Facebook
Twitter
Telegram
WhatsApp

 

High court lawyers Gattu Vamanrao and Nagmani couple brutally killed at Crime scene was guarded by Peddapelli – police

పెద్దపల్లి : హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్యోదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఘటనా స్థలంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 17న మంథని నుంచి కారులో హైదరాబాద్‌ వెళ్తున్న వామన్‌రావు, నాగమణి దంపతులను రామగిరి మండలం కల్వచర్ల వద్ద దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలను సృష్టించిన విషయం తెలిసిందే.

Peddapalli: The murder of High Court lawyers Gattu Vamanrao and Nagmani is turning into a daily affair. Police have set up tight security at the spot in the wake of this. It is learned that the incident in which Vamanrao and Nagmani, who were traveling in a car from Manthani to Hyderabad on the 17th of this month, were brutally killed at Kalvacharla in Ramagiri zone has caused severe tremors across the state.

ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు కేసులోని సాక్ష్యాలను భద్రపరచాలని దర్యాప్తు అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. హత్యకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోలను సైతం భద్రపరచాలని సూచించింది. సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు పంచనామా చేసి వాహనాలను ఘటన స్థలం నుంచి తొలగిస్తుంటారు. కాగా న్యాయవాదుల హత్యోదంతం సున్నితమైనది కావడం, దీనికి తోడు కేసుపై హైకోర్టు ప్రత్యేక దృష్టిని సారించటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

The High Court, which received the incident as Sumoto, issued orders to the investigating officers to preserve the evidence in the case. It also suggested that videos circulating on social media related to the murder be preserved. Vehicles are usually evacuated from the scene of an accident. While the lawyers’ murder case is sensitive, the High Court’s special focus on the case has gained prominence.

హత్య జరిగిన స్థలం వద్ద సాక్ష్యాధారాలను భద్రపరిచే విషయంలో మొదట కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పటికీ, ఆ తర్వాత పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇతరులెవరూ ఘటన స్థలం వద్దకు రాకుండా చుట్టూ కోన్స్‌తో తాత్కాలికంగా కంచెతో పాటు సిబ్బందిని కాపలాగా ఉంచారు. అలాగే హతుల రక్త నమూనాలతో పాటు కారుపై నిందితుల వేలి ముద్రలను ఇప్పటికే సేకరించారు. ప్రత్యేక దర్యాప్తు అధికారులు మరోసారి ఘటన స్థలాన్ని పరిశీలించడంతో పాటు కారుపై నిందితుల వేలిముద్రలను సేకరించే అవకాశం ఉండటంతో కారును అక్కడే ఉంచుతున్నట్లు తెలుస్తోంది. కోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఘటనా స్థలంలో బందోబస్తును కొనసాగించనున్నట్లు సమాచారం.

Although there was some negligence at first in preserving the evidence at the scene of the murder, fortified security was then established. Others guarded the crew along with a temporary fence with cones around them to prevent them from getting to the scene. As well as blood samples of the killers, the fingerprints of the accused on the car have already been collected. It appears that the Special Investigation Officers are once again inspecting the scene and keeping the car there as there is a possibility of collecting the fingerprints of the accused on the car. Information that security will continue at the scene until further orders from the court.