హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించిన బిట్టు శ్రీను!

0
108

పెద్దపల్లి : హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీను రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Peddapalli : Sensational matters are coming to light in the remand report of Bittu Srinu, the accused in the murder case of High Court lawyer Vamanrao and his wife.

వామన్‌రావు హత్యకు నాలుగు నెలల క్రితమే ప్లాన్‌ చేసినట్లు అతడు వెల్లడించాడు. అడ్వకేట్‌ వామన్‌రావు బతికి ఉంటే తమకు ఎన్నటికైనా సమస్యేనని భావించిన కుంట శీను, తాను హత్యకు పథకం రచించినట్లు పేర్కొన్నాడు. కాగా బిట్టు శ్రీనుకు సంబంధించిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టుపై వామన్‌రావు గతంలో అనేక కేసులు వేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు పెరిగాయి.

He revealed that Vamanrao had planned the assassination four months ago. Kunta Seenu, who thought they would never have a problem if Advocate Vamanrao was alive, said he had planned the assassination. Vamanjarao has filed several cases in the past against the Putta Lingamma Charitable Trust belonging to Bittu Sreenu. This increased the differences between the two factions.

ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం తమ స్వగ్రామం గుంజపడుగులోనే పాత స్కూల్ బిల్డింగ్ నుంచి రెక్కీ నిర్వహించిన శ్రీను గ్యాంగ్.

The order was issued four months ago by the Sreenu gang, which was run by Rekki from an old school building in their hometown of Gunjapadugu.

ఆయనను హత్య చేసేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడ జనసమ్మర్ధం ఎక్కువగా ఉండటంతో వారి పన్నాగం విఫలమైంది. దీంతో ఈనెల 17వ తేదీన పక్కాగా ప్లాన్‌ చేసిన దుండగులు. వామన్‌రావు ఒంటరిగా దొరకడంతో ఆయనతో పాటు భార్యను కూడా హతమార్చారు. వారిద్దరు చనిపోయారని నిర్దారించుకున్న తర్వాత కుంట శీను, బిట్టు శ్రీనుకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.

Tried to kill him. However, their plot failed due to overcrowding there. With this, the thugs who had planned exactly on the 17th of this month. Vamanrao was found alone and killed along with his wife. After confirming that the two of them were dead, Kunta Sreenu phoned Bittu Sreenu and informed him.

దీంతో అతడిని మహారాష్ట్రకు పారిపొమ్మని బిట్టు శ్రీను సలహా ఇచ్చాడు. తాను మాత్రం రెండు రోజులు ఇంట్లోనే మకాం వేశాడు. అంతేగాక హత్యకు ముందు వేరే సిమ్ కొనుగోలు చేసిన బిట్టు శ్రీను వాటి ద్వారానే తన భాగస్వాములతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ పెద్దపల్లి జంట హత్యల కేసును త్వరిగతిన ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. బిట్టు శ్రీనును అతడి ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు.

With this, Bittu Sreenu advised him to flee to Maharashtra. He stayed at home for two days. It is learned that Bittu Sreenu, who had bought a different SIM before the murder, was in talks with his partners through them. Police have arrested the accused in connection with the Peddapalli twin murder case, which has caused a stir across the state. Bittu Sreenu was taken into custody at his home.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here