హైకోర్టు లాయర్ గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసు విచారణ

0
339
Facebook
Twitter
Telegram
WhatsApp

నిందితుల కస్టడీ కోరుతూ మంథని కోర్టులో పోలీసుల పిటిషన్

Police petition in Manthani court seeking custody of the accused

పెద్దపల్లి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుల కస్టడీ కోరుతూ మంథని కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్​పై విచారణ జరుగుతోంది. కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరి కస్టడీని కోరుతూ రామగిరి పోలీసులు పిటిషన్ వేశారు.

The trial in the murder case of a high court lawyer couple, which has created a statewide sensation, is ongoing. A petition filed by the police in Manthani court seeking custody of the accused is being heard. Ramagiri police have filed a petition seeking custody of Kunda Sreenu and two others.

ఈనెల 19న ముగ్గురు నిందితులను ఘటనాస్థలికి తీసుకువెళ్లి హత్య సీన్​ రీకన్​స్ట్రక్షన్ చేశారు. ప్రస్తుతం వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నిందితులకు వాహనం, ఆయుధాలు సమకూర్చిన బిట్టు శ్రీనును పోలీసులు విచారిస్తున్నారు.

On the 19th of this month, the three accused were taken to the scene and the murder scene was reconstructed. They are currently remand prisoners. Police are investigating Sreenu, who provided the vehicle and weapons to the accused.

న్యాయవాద దంపతుల హత్య కేసును. స్థానిక పోలీసులే దర్యాప్తు చేయనున్నారు. సీబీఐకి ఇవ్వాలని, సిట్​ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు, రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఉన్నతాధికారులు మాత్రం. స్థానిక పోలీసులతోనే పూర్తి చేయించాలని భావిస్తున్నారు. త్వరలోనే అభియోగ పత్రాలు కూడా దాఖలు చేయనున్నారు.

The murder case of a lawyer couple, which created a sensation in the state, will be investigated by the local police. Lawyers and political parties are demanding to give to the CBI and set up a SIT. But the bosses are. It is expected to be completed by the local police. Chargesheets will also be filed soon.

• వామన్‌రావు శరీరంపై 14 గాయాలు?
న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో కీలకమైన శవ పరీక్ష నివేదిక సోమవారం పోలీసుల చేతికి అందనుంది. ఇది విచారణను వేగవంతం చేయడానికి దోహదపడనుంది. ఘటన ఎప్పుడు జరిగింది. ఎంతసేపటికి అంబులెన్స్‌ అక్కడికి చేరుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకురావడానికి ఎంత సమయం పట్టింది. దంపతులు ఘటనా స్థలంలోనే మృతి చెందారా. ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గంమధ్యలో ప్రాణాలు వదిలారా. వంటి సందేహాలకు తెరపడే అవకాశముంది. మృతదేహాలకు గురువారం ఉదయం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో శవ పరీక్షలు నిర్వహించారు.

• 14 injuries on Vamanrao’s body?
A key autopsy report on the murder of lawyers Vamanrao couple will be handed over to the police on Monday. This will help speed up the investigation. When did the incident take place? How long did it take for the ambulance to reach there? How long did it take to bring the injured to the hospital? Did the couple die on the spot? The bodies were autopsied at Peddapalli Government Hospital on Thursday morning.

గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరు వైద్యులు సుమారు మూడు గంటలకుపైగా శ్రమించారు. సాధారణంగా ఈ ప్రక్రియకు అర గంట నుంచి గంట వరకు పడుతుంది. కాని ఈ కేసులో వైద్యులు ఎక్కువ సమయం తీసుకున్నారు. అవసరమైన భాగాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. పదునైన ఆయుధాలను వినియోగించడంతో శరీరంలోని అంతర్గత అవయవాల్లో లోతైన గాయాలైనట్లు తెలిసింది. నాగమణి శరీరంపై 6, వామన్‌రావు శరీరంపై 14 గాయాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నివేదికతో గాయాల తీవ్రత తెలియడంతో పాటు ఘటన తర్వాత ఎంత సమయానికి న్యాయవాదులు మృతి చెందారు? సకాలంలో వైద్య సాయం అందించగలిగితే బతికేవారా? తదితర అంశాల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.

The two doctors toiled for about three hours as the severity of the injuries was high. This process usually takes half an hour to an hour. But in this case the doctors took more time. The necessary parts were sent to the forensic lab. The use of sharp weapons has been known to inflict deep wounds on internal organs of the body. It is believed that Nagmani had 6 injuries on her body and Vamanrao had 14 injuries on her body. With this report the severity of the injuries was known and how long after the incident did the prosecutors die? Survivors if medical help can be provided in a timely manner? Clarity on other issues is likely to come.