తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, పది మందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌లుగా నియమించింది.
వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లుగా జగ్గారెడ్డి, మహేష్‌గౌడ్, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్‌కుమార్.వైస్ ప్రెసిడెంట్లుగా చంద్రశేఖర్, దామోదర్‌రెడ్డి, కొల్లు రవి, వేంనరేందర్‌రెడ్డి, రమేష్ ముదిరాజ్, కుమార్‌రావ్, జావెద్ అమీర్, గోపిశెట్టి నిరంజన్, పోడెం వీరయ్య, సురేష్ షెట్కర్. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మధుయాష్కీ, కన్వీనర్‌గా అజ్మతుల్లా హుస్సేన్.. ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్‌గా దామోదర రాజనర్సింహ నియమితులయ్యారు. కాగా, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.