కరోన రోగి మహిళకు ఆక్సిజన్ అందక మృతి

0
285

చంద్రపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన

చంద్రపూర్ : వేగంగా పెరుగుతున్న కోవిడ్ సంక్రమణతో పాటు, చంద్రపూర్‌లో ప్రబుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం కూడా జిల్లావాసుల జీవితాలకు శత్రువుగా మారింది. సరి అయిన చికిత్స తోపాటు ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఇటీవల ఒక మహిళ మరణించింది.

శుక్రవారం ఇక్కడ కోవిడ్ ఆసుపత్రిలో ఒక కరోన సోకిన మహిళ ను చేర్చారు. కరోన సోకటం వల్ల కామహిళ యొక్క ఆక్సిజన్ స్థాయి గణనీయంగా తగ్గింది. ఆమెను చక్రాల కుర్చీపై ఆసుపత్రికి తీసుకువచ్చారు కుటుంబ సబ్యులు తక్షణ చికిత్స చేసి ఆక్సిజన్ అందించాలని డిమాండ్ చేసారు. కానీ అక్కడ ఉన్న వైద్యులు మరియు సిబ్బంది కూడా ఆ మహిళను పట్టించుకోలేదు. ఆమెకు కనీసం ఒక మంచం కూడా కేటాయించలేదు. కాని అప్పటికి ఆమె చనిపోయింది.

ప్రజలు కోవిడ్ ఆసుపత్రులకు కరోన సంక్రమణ తర్వాత చికిత్సకు వస్తారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రులలో వైధ్యుల నిరంతర నిర్లక్ష్యం ప్రజల జీవితాలపై ప్రమాదంగా మారుతోంది. అటువంటి పరిస్థితిలో, వైధ్యులలపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రికి చేరుకున్న తరువాత కూడా, చికిత్స లేకపోవడం వల్ల ఎవరైనా మరణిస్తే, అది ఆరోగ్య విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ సిగ్గుచేటు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here