తాడోబా అభయారణ్యాల అతిథిగృహం వద్ద నటుడు నాగచైతన్య దంపతులు
చంద్రపూర్ : మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో పులులకు ప్రసిద్ధి చెందిన తాడోబా అభయారణ్యాలను హీరో నాగచైతన్య ఆదివారం తన కుటుంబసమేతంగా విచ్చేశారు. పులులు, ఇతర జంతువులను తిలకించేం దుకు నటుడు నాగచైతన్య, భార్య సమంతతో కలిసి చిమూర్ మార్గంలోని తాడోబా ప్రధాన ద్వారం కొలారా గుండా ప్రవేశించి అచ్చట ఉన్న వెదురు అతిథిగృహంలో బసచేశారు. సాయంత్రం అభయారణ్యాల జిప్సీలో తాడోబాను తిలకించివచ్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
నాగచైతన్య – సమంతకు అటవీశాఖ అధికా రులు సాదరస్వాగతం పలికారు. ఆదివారం రాత్రి అతి థిగృహంలోనే వారు బస చేశారు.