మద్యం లభించక.. శానిటైజర్‌ తాగి ఏడుగురు మృతి

Facebook
Twitter
Telegram
WhatsApp

యావత్మాల్‌ జిల్లాలో శానిటైజర్‌ తాగి ఏడుగురు మృతి చెందడంతో కలకలం రేగింది. జిల్లాలోని వణీ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరోవైపు శానిటైజర్‌ తాగిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా మద్యం లభించకపోవడంతో వీరంతా శానిటైజర్‌ సేవించారని తెలిసింది. ఏడుగురిలో ముగ్గురు ఇంట్లోనే మృతి చెందినప్పటికీ మిగతావారు మాత్రం ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం మృతి చెందారు.